ప్రారంభానికి సిద్ధమవుతున్న కాళేశ్వరం ప్యాకేజ్ 08
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్టమొదటి పంప్ మోటర్‌ను ప్రాజెక్టు అధికారులు ట్రయల్ రన్‌ను నిర్వహించారు.139 మెగావాట్ల సామర్థ్యంతో ఈ మోటారు ప్రపంచ సాగునీటి రంగంలోనే అతి పెద్దదని తెలిపారు. భూగర్భంలో 340x25x65.5 డైమన్షన్లతో ఈ మోటర్‌ను బిగించినట్లు మంత్రి తెలిపారు. మోటారు గరిష్టంగా 214 ఆర్.పీ.ఎం స్వీడ్‌తో నడుస్తుందని, ఇవాల్టీ డ్రై రన్లో మోటర్ పూర్తి సామర్థ్యంలో పనిచేసిందని వెల్లడించారు.