మేఘా ఇంజనీరింగ్ సంస్థ క్యాన్సర్ రోగుల సౌకర్యార్థం నిమ్స్లో అత్యాధునిక సదుపాయాలతో అంకాలజీ భవనాన్ని రూ.5 కోట్లు వెచ్చించి , 18,000 చదరపు అడుగుల స్థలంలో నూతన భవనాన్ని నిర్మించింది. రోగులకు అనుకూలంగా ఉండే విధంగా డిజైన్ చేసిన 50 పడకలను ఈ వార్డుల్లో ఏర్పాటు చేశారు. ఐసీయూలో 5 బెడ్లు, పురుషుల వార్డులో 12 బెడ్లు, మహిళల వార్డులో 10 బెడ్లు, చిన్నపిల్లల వార్డులో 11 బెడ్లు, లుకేమియా వార్డులో 12 బెడ్లను ఏర్పాటు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లోని సౌకర్యాలకు దీటుగా ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన నిమ్స్ అంకాలజీ భవనం రోగులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఎంఈఐఎల్ గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించింది. భోజనామృతం అనే పేరుతో హైదరాబాద్లోని నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రిలో రోగుల వెంటవచ్చే అంటెండెంట్లకు మధ్యాహ్నం ఉచితంగా భోజనాన్ని అందించింది. ఈ పథకానికి అయిన మొత్తం ఖర్చును మేఘా ఇంజనీరింగ్ భరించింది.