మిషన్ భగీరథలోనే భారీ పథకం.. మహబూబ్ నగర్ వాటర్ గ్రిడ్
1. మిషన్ భగీరథలోనే అతిపెద్దది మహబూబ్ నగర్ వాటర్ గ్రిడ్.
2. కరవు జిల్లాగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు
అందించే మహబూబ్ నగర్ వాటర్ గ్రిడ్ ను ఎంఈఐఎల్ చేపట్టింది.
3. అత్యధిక సెగ్మెంట్లతో, భారీ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లతో, అతి
ఎక్కువ మంది లబ్ధిదారులకు నీరు అందించే విధంగా రూపొందించిన మేఘా.
4. ఈ పథకం ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలోని 55 మండలాలు, 9
మున్సిపాలిటీలతోపాటు రంగారెడ్డి జిల్లాకు తాగునీరు అందించేలా ఏర్పాటు.
5. వనపర్తి సెగ్మెంట్ లో ఇంట్రా విలేజ్ పనులను కూడా ఎంఈఐఎల్ చేపట్టి,
తాగునీరు సరఫరా చేస్తున్నది.
6. మహబూబ్ నగర్ జిల్లా ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సేకరించిన నీటిని శుద్ధి
చేసి జిల్లాలోని బాలకిష్టాపూర్, వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్,
కల్వకుర్తి, అచ్చంపేట, షాద్ నగర్, జడ్చర్ల, మన్యంకొండ, కొడంగల్, మద్దూరు,
మహబూబ్ నగర్ పట్టణంతోపాటు రంగారెడ్డి జిల్లాకు సరఫరా చేస్తారు.
7. ఇందుకోసం రోజుకు 100 ఎల్పీసీడీ నీటిని శుద్ధి చేసే విధంగా 23 ఎంఎల్డీ నుంచి 77
ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ఆరు వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటులను మేఘా
నిర్మించింది.
8. 13 పంప్ హౌస్లతో పాటు 20 కిలోలీటర్ల నుంచి 8500 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన
66 క్లియర్ వాటర్ రిజర్వాయర్లు ఏర్పాటు.
9. 10 కిలోలీటర్ల నుంచి 8500 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన 511 భూ ఉపరితల
రిజర్వాయర్లు నిర్మాణం.
10. 326.50 కిలోమీటర్ల ఎంఎస్ పైపులైన్, 4.07 కిలోమీటర్ల పీసీసీపీ పైపులైన్,
35.1 కిలోమీటర్ల బీడబ్ల్యూఎస్సీ పైపులైన్, 1638 కిలోమీటర్ల డీఐ
పైపులైన్ ఏర్పాటు.
11. మొత్తం 2900 గ్రామాలకు గానూ 2700 గ్రామాలకు ప్రస్తుతం నీటి సరఫరా
చేస్తున్నారు.
12. 2019 మార్చినాటికి పూర్తిస్థాయిలో నీటిని అందించే విధంగా ఎంఈఐఎల్
పనులను వేగంగా కొనసాగిస్తున్నది.
13. ఈ పథకం ద్వారా భవిష్యత్తులో 35 లక్షల 18 వేల మందికి తాగునీరు అందుతుంది.