1. దశాబ్దాలుగా నల్గొండ జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు
శాశ్వత పరిష్కారం చూపేందుకు ఉద్దేశించిన ఏకేబీఆర్-నల్గొండ వాటర్ గ్రిడ్
ను సకాలంలో పూర్తి చేసిన ఎంఈఐఎల్.
2. కృష్ణ నదీ జలాలను శుద్ధిచేసి ఫ్లోరైడ్ నీటితో బాధపడుతున్న గ్రామాలకు సరఫరా
చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
3. ఇందుకోసం రోజుకు 100 ఎల్పీడీసీల నీటిని శుద్ధి చేసేవిధంగా 70 ఎంఎల్డీ, 50
ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన రెండు వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటులను
ఏర్పాటు చేసిన మేఘా.
4. నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం గ్రామం వద్ద
70 ఎంఎల్డీ, పీ.ఏ.పల్లి మండలం కోదండపూర్ వద్ద 50 ఎంఎల్డీ నీటి శుద్ధి
కేంద్రాలను మేఘా నిర్మించింది.
5. ఈ పథకం ద్వారా నల్గొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు స్వచ్ఛమైన
తాగునీరు లభిస్తున్నది.
6. 200 కిలోలీటర్ల నుంచి 2000 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన 19 సంపులు
ఏర్పాటు.
7. రెండు పంప్ హౌస్లు, ఒక ఆఫ్ టేక్ విత్ పంపుహౌజ్ నిర్మాణం.
8. 40 కిలోలీటర్ల నుంచి 2000 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన 57 భూ ఉపరితల
రిజర్వాయర్ల ఏర్పాటు.
9. 39.18 కిలోమీటర్ల ఎంఎస్ పైప్ లైన్, 861.65 కిలోమీటర్ల డీఐ పైపులైన్
తోపాటు ఇంటింటికీ ఇంటర్ నెట్ అందించేందుకు ఉద్దేశించిన హెచ్డీపీఈ
పైపులైన్ 1527.37 కిలోమీటర్లు ఏర్పాటు.
10. ఈ పథకం ద్వారా 1159 ఆవాసాలకు తాగునీరు అందిస్తున్నారు.