మేఘా ఇంజనీరింగ్‌ మధ్యప్రదేశ్‌లోని నర్మదా–క్షిప్రా సింహస్థ నదులను అనుసంధానించే ఎన్‌కేఎస్‌ఎల్‌ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసి రికార్డు సృష్టించింది.ఎన్‌కేఎస్‌ఎల్‌ ప్రాజెక్టు ద్వారా మాల్వా ప్రాంతంలోని గ్రామాలు, పట్టణాల్లోని లక్షలాది ప్రజలకు తాగునీరు అందుతున్నది. ఇది దేశంలోనే తొలి నదీ అనుసంధాన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. మధ్యప్రదేశ్‌లో మాల్వా ప్రాంతం అత్యంత వెనుకబాటు తనానికి గురైంది. నీటి సమస్య తీవ్రంగా ఉంది. 400 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతానికి నీటిని కాలువల ద్వారా అందించడం సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం నర్మదా-క్షిప్రా సింహాస్థ అనుసంధానం చేపట్టింది.