అత్యాధునిక సదుపాయాలతో ఆంకాలజి భవనం
నిమ్స్ లో ఎంఈఐల్ కాన్సర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ క్యాన్సర్ రోగుల సౌకర్యార్థం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ (నిమ్స్)లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన అంకాలజీ భవనాన్ని మంత్రులు కె. తారకరామారావు, కె. లక్ష్మారెడ్డి ప్రారాంభించారు. ఈ
భవనం పూర్తి అధునాతన వైద్య సదుపాయాలతో ఎంఈఐఎల్ ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సేవలకు మద్దతుగా ఎంఈఐఎల్ అధునాతన సౌకర్యాలతో క్యాన్సర్ వార్డును నిర్మించడం కొనియాడదగినదని వారు పేర్కొన్నారు. మంత్రులు మొత్తం అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేఘా ఇంజనీరింగ్ చైర్మన్ పిపిరెడ్డి, ఎండీ పివి కృష్ణారెడ్డి దగ్గరుండి అన్ని విభాగాలను మంత్రులకు చూపించారు. ఈ సందర్భంగా ఎండి పివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడేళ్ళపాటు వార్డు నిర్వహణ వ్యయాన్ని ఎంఈఐఎల్ సంస్థ భరిస్తుందని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అదే విధంగా క్రింది అంతస్థులోని క్యాన్సర్ వార్డును ఆధునీకరించేందుకు ఎండి పివి. కృష్ణారెడ్డి ముందుకు రావడం పట్ల సంస్థ వితరణను మంత్రులు కొనియాడారు.